అమరావతి : ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్(Steel Plant ) లో భారీ అగ్ని ప్రమాదం(Fire Incident) సంభవించింది. ప్లాంట్లోని కోకోవెన్ విభాగంలో ఉన్న నాఫ్తలీన్ యూనిట్లో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్ దగ్ధమైంది. భారీగా మంటలు చెలరేగి యంత్రాలు, విద్యుత్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాదాపు రెండు గంటల పాటు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.