అమరావతి : ఏపీలో అధికార వైసీపీ అభ్యర్థుల (YCP candidates) జాబితాను వెల్లడించింది. శనివారం ఇడుపులపాయ వైఎస్సార్ సమాధి వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ జాబితాను ప్రకటించారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు గాను ఒక అనకాపల్లి(Ankapalli pending) ఎంపీ మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
గతంలో మున్నెన్నడు లేని విధంగా 81 ఎమ్మెల్యే స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 18 చోట్ల ఎంపీ స్థానాల్లో సిట్టింగ్లకు అవకాశం ఇవ్వలేదు. దాదాపుగా 50 శాతం స్థానాల్లో మార్పులు చేశామని, ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమేనని వైఎస్ జగన్ తెలిపారు. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు చేతల్లో చూపించామని ఆయన వెల్లడించారు.
ఈసారి 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని చెప్పారు. బీసీలకు 48 అసెంబ్లీ స్థానాలు, 11 ఎంపీ స్థానాలు బీసీలకే కేటాయింపులు చేశామని వివరించారు. మహిళలకు గత ఎన్నికల్లో 19ఇస్తే ఈసారి 24 దాకా ఇచ్చామని అన్నారు. మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఈసారి 7 స్థానాలకు పెంచగలిగామని తెలిపారు.