Mahesh Comments | జనసేన నేత పవన్‌కల్యాణ్‌పై పోతిన మహేశ్ ఘాటు వ్యాఖ్యలు
Mahesh Comments | నిన్న, మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి వైసీపీలోకి ప్లేట్ ఫిరాయించిన పోతిన మహేశ్ శనివారం మీడియా సమావేశంలో పవన్‌కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
అమరావతి : నిన్న, మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి వైసీపీలోకి ప్లేట్ ఫిరాయించిన పోతిన మహేశ్ (Pothina Mahesh) శనివారం మీడియా సమావేశంలో పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పై తీవ్ర ఆరోపణలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలులో ఉన్న చంద్రబాబు (Chandra Babu) ను పవన్‌కల్యాణ్ కలిసి వచ్చిన తరువాత రాజకీయంగా అనేక మార్పులు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు వద్ద పవన్‌కల్యాణ్ ప్యాకేజీలు(Packages) తీసుకుని అనేక ఆస్తులు కొనుగోళ్లు చేశారని, ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయని వెల్లడించారు. బినామీ పేర్లతో ఆస్తులు కొనగోలు చేశారని ఆరోపించారు.
కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారని పేర్కొన్నారు. జనసేన పార్టీలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్‌కు రూ. 10 కోట్ల స్పోర్స్ట్ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు పల్లకి మోయడమే పవన్ కల్యాణ్ లక్ష్యమని ఎద్దేవా చేశారు. పవన్ ప్యాకేజీ డబ్బులు బ్లాక్ మనీని హరిహర వీరమల్లు సినిమా ద్వారా వైట్ మనీగా మార్చుతున్నారని ఆరోపించారు. తన సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటే తాను చర్చకు సిద్ధమని పోతిన మహేశ్ స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

