శాస్త్రోక్తంగా వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ
పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి...
తిరుపతి: పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన నిర్వహించారు. అనంతరం 8.45 గంటల వరకు కటక లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందించారు. మధ్యాహ్నం నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. దాంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ వకుళమాతను దర్శించుకుని తరించారు.

డ్రై ఫ్లవర్ టెక్నాలజీ కళాకృతులకు ప్రశంసలు

డ్రైఫ్లవర్ టెక్నాలజీతో టీటీడీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా వివిధ కళాకృతులతో తయారు చేస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఫొటో ప్రేమ్‌లు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన.డ్రైఫ్లవర్ టెక్నాలజీతో తయారుచేసిన వస్తువులను పరిశీలించి, నిర్వాహకులను ప్రశంసించారు.
టీటీడీకి చెందిన వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో డ్రైఫ్లవర్ టెక్నాలజిని ఉపయోగించి శ్రీవారు, అమ్మవార్ల ఫొటో ప్రేమ్‌లు, పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు తదితర ఉత్పత్తులను తయారు చేయడానికి టీటీడీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో గత ఏడాది సెప్టెంబరు 13వ తేదీన ఎంఓయూ కుదిరింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

