తిరుమల : మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) గురువారం తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( BR Naidu ) , అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్యనాయుడు , ఆలయ పూజారులు గవర్నర్కు స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేశారు. రంగనాయకుల మండపంలో, వేద పండితులు ఆయనకు వేదఆశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీవారి తీర్థ ప్రసాదాలు, 2025 టీటీడీ క్యాలెండర్లు , డైరీలను అందజేశారు. ఆయన వెంట ఏపీ మంత్రి నారాయణ, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, పి రామమూర్తి, మల్లెల రాజశేఖర్ గౌడ్, దివాకర్ రెడ్డి, సీవో మురళీకృష్ణ, ఆలయ డీఈవో లోకనాధం తదితరులు ఉన్నారు.