అమరావతి : మరికొద్ది గంటల్లో విడుదలవుతున్న పుష్ప-2 సినిమాపై (Pushpa-2 ) ఏపీ హైకోర్టులో (AP High Court) లంచ్మోషన్ దాఖలు అయ్యింది. సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరల (Ticket Price) పెంపుతో పాటు, ప్రదర్శనల (Shows) సంఖ్యను పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ కోర్టులో లంచ్మోషన్ దాఖలు చేశారు .
సినిమా నిర్మాణానికి రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు ఆధారాలు సమర్పించలేదని పిటిషనర్ ఆరోపించారు. సినిమా ప్రదర్శనల సంఖ్యను నిబంధనలకు విరుద్దంగా పెంచడం సరైనది కాదని పిటిషనర్ వాదనకు కోర్టు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం సమాదానం చెప్పాలని సూచించింది. ప్రతివాదులగా నిర్మాతలు, అల్లు్ అర్జున్, రష్మిక, శ్రీలీల చేర్చారు. పిటిషన్పై పరిశీలించిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల నటించిన పుష్ప-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు( గురువారం) విడుదలవుతుంది. ఇప్పటికే సినిమా పాటల పరంగారికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మల్టిఫెక్స్లు, ప్రీమియర్ షోలకు ధరలు పెంచింది.