అమరావతి : జాతీయ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) అన్నారు. ఈనెల 4న ఓట్ల లెక్కింపు(Counting) సందర్భంగా వైసీపీ(YCP) కౌంటింగ్ ఏజెంట్లతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్లో మాట్లాడారు. తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని, ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.
తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని ఒక పార్టీకి అనుకూలంగా ప్రకటించిందని ఆరోపించారు. ఏపీలో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెపై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టేందుకు చేసే యత్నాలపై సహనం పాటించాలని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandra Babu) ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.