తిరుపతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా మంగళవారం తిరుపతిలోని కేంద్రీయ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం(Blood Donation )నిర్వహించారు. టీటీడీ ఈవో(Ttd EO) ఎవి ధర్మారెడ్డి రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈవో మాట్లాడుతూ, మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.జేఈవో లు సదా భార్గవి, వీర బ్రహ్మం, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మురళీ ధర్ , సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో స్నేహలత ,ఆర్ఎంవో డాక్టర్ నర్మద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.