Srisailam | శ్రీశైలం : శ్రీశైలం పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడిన మద్యం, నాటుసారాను గురువారం పోలీసులు ధ్వంసం చేశారు. కర్నూల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆత్మకూర్ డీఎస్పీ రామాంజనేయ నాయక్ సూచనల మేరకు నంద్యాల ఎక్సైజ్ ఏఈఎస్ రాముడు, సీఐ జీ ప్రసాదరావు, ఆత్మకూరు ఎక్సైజ్ సీఐ మోహన్ రెడ్డి, సిబ్బంది రఘునాథుడు, బాలకృష్ణ, నాను నాయక్ ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. గత రెండేళ్లలో శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన 15 కేసుల్లో 186 లీటర్ల నాటుసారా.. 17 కేసుల్లో పట్టుబడ్డ ఏపీ మద్యం 598 బాటిల్స్, 11 కేసుల్లో పెట్టుబడ్డ తెలంగాణ మద్యం 599 బాటిల్స్‌ను, 43 కేసుల్లో నాటు సారాయిని శ్రీశైలంలోని డంపింగ్ యార్డ్ వద్ద రెవెన్యూ సిబ్బంది. పంచాయతీదారుల సమక్షంలో ట్రాక్టర్‌తో దొక్కించి ధ్వంసం చేసినట్లు పోలీసులు వివరించారు.