అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్, మండలి చైర్మన్లకు లేఖ రాశారు. నాటు సారా మరణాలపై ప్రభుత్వం చర్చకు అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జే బ్రాండ్లలో ప్రాణాలు తీసే ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని వివరించారు. ఈ మేరకు ల్యాబ్ రిపోర్టులు లేఖలకు జోడించి అందజేశారు.
కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. సారా మరణాలను సహజ మరణాలంటూ ప్రభుత్వం చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని , జే బ్రాంబ్, నాటుసారాతోనే మరణాలు సంభవించాయన్న ఆధారాలు ఉన్నాయని వారు లేఖలో వెల్లడించారు.
ఏపీ అసెంబ్లీ నుంచి 6 గురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఈవాళ సస్పెన్షన్ చేశారు. సభను పదేపదే అడ్డుకోవడాన్ని సత్యప్రసాద్,రామకృష్ణ, అశోక్,రామరాజులను సభా సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సభలో ఈలలు వేశారని ఆరోపిస్తూ మరో ఇద్దరిని స్పీకర్ సస్పెన్షన్ చేశారు.