Leopard | వన్యప్రాణులు జనవాసాల్లోకి చేరి అందరినీ భయబ్రాంతులకు గురిచేయడం ఎప్పుడూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుందని తెలిసిందే. అలాంటి ఘటన ఒకటి ఏపీలో కలకలం రేపింది. చిరుత పులి ఓ ఇంట్లోకి చొరబడేందుకు యత్నించింది.. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలో వెలుగుచూసింది.
అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన చిరుత పులి వెంకటాపురం గ్రామంలోని లెక్చరర్ బాలాజీ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించింది.. అయితే పులిని చూసిన బాలాజీ కుటుంబసభ్యులు భయంతో కేకలు వేశారు. దీంతో ఆ చిరుత భయంతో అక్కడి నుంచి పారిపోయింది. చిరుత పారిపోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. చిరుతపులి సంచారంతో భయాందోళనలో ఉన్న స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులు పులిని బంధించాలని డిమాండ్ చేస్తున్నారు. చిరుతపులికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సీసీటీవీ ఫుటేజ్
ఇంట్లోకి చొరబడేందుకు చిరుత పులి యత్నం..కుటుంబ సభ్యుల కేకలతో పారిపోయిన పులి
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలోని లెక్చరర్ బాలాజీ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన చిరుత పులి
భయంతో కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పరార్
చిరుతపులి సంచారంతో… pic.twitter.com/RrrTGWwWXz
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2026