అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చిరుత దాడులు ( Leopard attacks ) కలవరం సృష్టిస్తున్నాయి. తిరుమల ఘాట్రోడ్డులో చిరుతల సంచారం కలకలం రేపుతుండగా నంద్యాల జిల్లా శ్రీశైలం ( Srisailam ) సమీపంలో బుధవారం రాత్రి తల్లీ్ బిడ్డలపై దాడి చేసి గాయపరిచింది.
శ్రీశైలానికి 12 కి.మీ దూరంలోని చెంచుగూడెం చిన్నారుట్లలో తల్లి అంజమ్మ తన బిడ్డతో కలిసి నిద్రపోయింది. రాత్రి చిరుత ఒక్కసారిగా ఇద్దరిపై దాడి చేసి చిన్నారిని ఎత్తుకెళ్లింది. తండ్రి అంజయ్య కేకలు వేయడంతో చిరుత చిన్నారిని వదిలివెళ్లింది. గాయపడ్డ చిన్నారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.
సమాచారం అందుకున్న అటవీ, పోలీసు, రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుత అటవీ శివారు ప్రాంతంలో సంచరిస్తున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.