Srisailam | శ్రీశైలంలో తరచూ చిరుత కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైల డ్యామ్, ఆలయ పరిసరాల్లో కనిపించిన చిరుత.. తాజాగా ఆలయ పూజారి ఇంటి వద్ద సంచరించింది. పాతాళగంగ మెట్ల మార్గంలో ఉన్న పూజారి సత్యనారాయణ నివాస ప్రాంగణంలో అర్ధరాత్రి వేళ చిరుత ప్రవేశించింది. దీనికి సంబంధించిన ఫుటేజీ ఆలయ పూజారి నివాసంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.
చిరుత వచ్చిన సమయంలో పూజారి నివాసంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా, ఆలయ పూజారి ఇంట్లోకి చిరుత వచ్చిందని తెలియడంతో స్తానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత సంచారం ఎక్కువ కావడంతో స్థానికులు, భక్తులకు అటవీశాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు.
శ్రీశైలం పూజారి ఇంట్లో చిరుత పులి సంచారం.. సీసీటీవీ ఫుటేజ్
పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి సంచరించిన చిరుత పులి pic.twitter.com/3YjVJ6blkB
— Telugu Scribe (@TeluguScribe) January 6, 2025
చిరుత కదలికల నేపథ్యంలో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.