అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) జలాశయం వద్ద కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి రాత్రి కొండ చరియలు విరిగి పెద్ద బండరాళ్లు ఘాట్‌రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. రాత్రి కారణంగా రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం గమనించిన ప్రయాణికులు జిల్లా అధికారులకు సమాచారం అందజేయడంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
రాత్రి నుంచి పరిసర ప్రాంతాల్లో ఎడతెరుపు లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. శ్రీశైలం జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చరియలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలోనూ పలుమార్లు కొండచరియలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరుగకముందే అధికారులు కొండచరియలు విరిగిపడక ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.