ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో శైవ క్షేత్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పోలీసు అధికారుల ద్వారా తెలుసుకుంటూ దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని సూచించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చూడాలని ఆదేశించారు.
Kurnool Sp
Kurnool Sp2