Srisailam | భ్రమరాంబ అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ
Srisailam | చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం ( ఏ రోజు ముందు వస్తే ఆ రోజు) శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం.
Srisailam | చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం ( ఏ రోజు ముందు వస్తే ఆ రోజు) శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ ఏడాది ఏప్రిల్ 26న కుంభోత్సవం నిర్వహిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు తెలిపారు.
అమ్మవారికి సాత్త్విక బలి నిర్వహించేందుకు ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. ఈ కుంభోత్సవంలో అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలు తదితరాలు సమర్పిస్తారు. కుంభోత్సవం నాడు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.

కుంభోత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియగానే ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి కొబ్బరి కాయలు సమర్పించడం జరిగిందని ఈఓ పెద్దిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజాదికాలు జరిపించామన్నారు. ఆ తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించినట్లు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

