Perni Jayasudha | మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో గతంలో అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదట 185 మెట్రిక్ టన్నులు బియ్యం మాయం అయ్యాయంటూ అధికారులు 1.68కోట్ల జరిమానా విధించారు. ఆ తర్వాత మరిన్ని బియ్యం బస్తాలు మాయమైనట్లుగా తేల్చారు. మొత్తం గోడౌన్ నుంచి 378 టన్నులు కనిపించడం లేదని గుర్తించారు.
ఈ క్రమంలో జరిమానా చెల్లించాలంటూ జయసుధకు జాయింట్ కలెక్టర్ తాజాగా నోటీసులు ఇచ్చారు. అదనంగా రూ.167కోట్లు చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. రేషన్ బియ్యం వ్యవహారంలో జయసుధ మచిలీపట్నం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆమెకు కోర్టులో ఊరట లభించింది. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధను ఏ1గా, ఏ2గా మేనేజర్ మానస తేజ్‌ను చేర్చారు. ఇప్పటికే మానస్ తేజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె కోర్టును ఆశ్రయించగా.. ముందస్తు బెయిల్ ఇచ్చింది. విచారణకు సహకరించాలని కోర్టు సూచించింది.