(KR Suryanarayana) విశాఖ: ఫిట్‌మెంట్‌పై అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే అని, అయితే, ఉద్యోగ సంఘాలు అయోమయ సందిగ్ధ స్థితిలో పడిపోయాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. ఇప్పటికిప్పుడు కార్యాచరణ చేపట్టే స్థితిలో ఉద్యోగ సంఘాలు లేవన్నారు. మూల వేతనం పెరిగినప్పుడే జీతాలు పెరగాలి అని, పాత బకాయిలు కలిపి ఇస్తే ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆదివారం ఆయన విజయనగరం యూత్ హాస్టల్లో ఉద్యోగుల చైతన్య వేదిక సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సూర్యనారాయణ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మెరుగైన ఫిట్మెంట్ విఫలమైందన్నారు. 23 శాతం ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులకు సంతోషంగా లేదని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ అమలును వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ప్రయోజనం లేకపోగా.. నష్టదాయకంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ సమీక్ష చేయాలని ఆయన సూచించారు.
సీపీఎస్‌పై తేల్చకపోవడం వల్ల ఉద్యోగుల భద్రత కొరవడిందని సూర్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పీఆర్సీపై జరిగిన ప్రచారం నాణేనికి ఒక వైపు మాత్రమే అని అర్థం చేసుకోవాలని కోరారు. ఫిట్మెంట్ అంశాన్ని పక్కన పెడితే మిగతా అంశాలపై స్పష్టత కొరవడిందన్నారు. ఈ విషయాలపై సీఎం జగన్‌ను కలిసి విన్నవించేలా అందరం కలిసి పనిచేయాలని సూచించారు. అయితే, కొన్ని సంఘాలు ఐసోలేటెడ్ అప్రోచ్‌తో ఉద్యమాన్ని నీరుగారుస్తున్నాయని ఆరోపించారు.
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..