సన్నాలు కష్టమే!.. మండిపోతున్న ఎండలు.. మాడిపోతున్న నార్లు
సన్న రకాల వరిసాగు ఇప్పుడు కష్టకాలంలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం పగబట్టినట్లు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నది. రోహిణి, మృగశిర కార్తెల్లో నార్లు పోసుకొని నెలలోపు నాట్లు వేసుకుంటే దిగుబడి బాగా వస్తుందని రైతుల నమ్మకం. అయితే, ఈ సారి మాత్రం రైతులు నార్లు పోసుకున్నా వాన లేక ఎండల తీవ్రతతో మొలకలు చనిపోతున్నాయి.
- దాటిపోతున్న అదును.. ముఖం చాటేసిన వరుణుడు
- చినుకు లేక రైతుల్లో ఆందోళన
హనుమకొండ సబర్బన్, జూన్ 19 : సన్న రకాల వరిసాగు ఇప్పుడు కష్టకాలంలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం పగబట్టినట్లు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నది. రోహిణి, మృగశిర కార్తెల్లో నార్లు పోసుకొని నెలలోపు నాట్లు వేసుకుంటే దిగుబడి బాగా వస్తుందని రైతుల నమ్మకం. అయితే, ఈ సారి మాత్రం రైతులు నార్లు పోసుకున్నా వాన లేక ఎండల తీవ్రతతో మొలకలు చనిపోతున్నాయి. 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సిన ఈ సమయంలో 40 డిగ్రీల పైబడి నమోదు కావడంతో వరినార్లు ఎదగడం లేదు. ఎండ తీవ్రతకు మొలకలు మాడిపోతున్నాయి. ఎండవేడి నుంచి నారు కాపాడుకునేందుకు రైతులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం లేకుండాపోతుంది. రెండు, మూడెకరాలకు రావాల్సిన నారు ఎకరానికి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
ఇప్పుడు మళ్లీ పోద్దామంటే సమయం మించిపోయింది. సన్నరకం వరి అంటేనే దీర్ఘకాలిక పంట. పంట కాలం కనీసం ఐదు నెలలు ఉంటుంది. అంటే. ఈ పాటికే పొలాలు దున్నుకోవాలి. మరో రెండు రోజుల్లో ఆరుద్ర కార్తె మొదలుకానుంది. అంటే నాట్లేసే సమయం వచ్చినట్లే. అయితే, ఈ సారి అందుకు భిన్నంగా పొలాలు దున్నుడు కూడా రైతులు మొదలు పెట్టలేదు. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఈ సారి తప్పనిసరిగా సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మెజార్టీ రైతులు ఆశతో సన్నాలు సాగు చేసేందుకు సమాయత్తమయ్యారు.
కానీ, ఈ తరుణంలో ఆకాశంలో మేఘాలు మాయమవ్వడంతో రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. వానకాలం మొదలై ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. సాధారణ వర్షపాతంలో కనీసం పది పైసల వంతు కూడా వానలు పడలేదు. ఇదే పరిస్థితి మరో పది రోజులు కొనసాగితే సన్నాల సాగు ఈ సారి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ వర్షాలు ఆలస్యమైతే తప్పని పరిస్థితుల్లో దొడ్డు రకాలను మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది. దీంతో విత్తన కొరత వచ్చే ప్రమాదముంది.
నారు చని పోతుంది
నాలుగు ఎకరాల్లో నాటు వేసేందుకు సన్నరకం నారు పోసిన. నారు మంచిగనే మొలిచింది. గిప్పుడు ఎండలు మండి పోతున్నాయి. రోజుకు రెండు మూడు సార్లు వేడి నీళ్లు తీసి చల్లటి నీళ్లు పెడుతున్న. అయినా మొలకలు చనిపోతున్నాయి. మళ్లీ ఇదే రకం వడ్లు తెచ్చి పోద్దామంటే విత్తనాలు లేవంటున్నరు. దొరికిన ఈ నారుకు ఆ నారుకు కలిసెటట్టు లేదు. ఏం చేయాలో అర్ధమయిత లేదు. మొగులు దిక్కు చూస్తే వాన పడుతదనే నమ్మకం లేదు. రోజుల ఉట్టిగనే బాయి కాడికి వచ్చుడు పోవుడు అయితాంది.
– కంబాల శ్రీనివాస్, రైతు, ఎల్కతుర్తి
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

