అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది యువతిపై చాకుతో (Knife attack) దాడి చేసి గాయపరిచాడు. అడ్డువచ్చిన యువతి తల్లిదండ్రులపైనా కూడా దాడిచేసి గాయపరిచాడు. బాపట్ల జిల్లా (Bapatla) లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భార్గవ్‌రెడ్డి (Bhargav reddy) అనే యువకుడు యువతి ప్రేమించట్లేదని అర్ధరాత్రి ఆమె ఇంటికెళ్లి చాకుతో దాడి చేశాడు.
కూతురుని కాపాడుకునేందుకు అడ్డువచ్చిన తల్లిదండ్రులపై దాడి చేశాడు. దీంతో గాయపడ్డ ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి(Hospital) తరలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.