అమరావతి : ఏపీ సరిహద్దుల్లో ఏనుగుల బీభత్సం సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏపీకి 8 కుంకి ఏనుగులు (Kunki Elephants) ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan ) కర్ణాటక సీఎం, అటవిశాఖ అధికారులతో గురువారం జరిపిన సమావేశంలో భేటీ అంశాలను వివరించారు.
గురువారం ప్రత్యేక విమానంలో పవన్‌కల్యాణ్ బెంగళూరు(Bengaluru) కు చేరుకోగా అక్కడి అటవీశాఖ మంత్రి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంను పవన్ శాలువాతో సన్మానించారు. అనంతరం అధికారులతో చర్చల తరువాత చర్చల వివరాలను పవన్‌కల్యాణ్ మీడియాకు వివరించారు .
మొత్తం ఏడు అంశాలపై చర్చించినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కర్ణాటక, ఏపీ సరిహద్దుల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందని, ఇరు రాష్ట్రాల సమన్వయంతో ఏనుగుల దాడిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. ఏనుగుల సమస్య పరిష్కరించేందుకు 8 కుంకి ఏనుగులను ఏపీకి ఇచ్చేందుకు కర్ణాటక ఒప్పుకోవడం సంతోషమని పేర్కొన్నారు.
అటవీ సంపద రక్షణకు ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఎర్రచంద్రనం అక్రమ రవాణాను అరికట్టాలని, వన్యప్రాణుల స్మగ్లింగ్ చేసే వారిని కట్టడి చేయాలని నిర్ణయించామని తెలిపారు. సుమారు రూ. 140 కోట్ల విలువ గల ఎర్రచందనాన్ని పట్టుకున్న కర్ణాటక అటవీ అధికారులను అభినందించారు. శ్రీశైలం , తిరుపతి క్షేత్రాలకు వచ్చే కర్ణాటక భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Ambati Rambabu | ఏపీలో శాంతిభద్రతలు ఉన్నట్టా ? లేనట్టా ? : మాజీ మంత్రి అంబటి రాంబాబు
Janmabhoomi-2 | ఏపీలో త్వరలో జన్మభూమి-2 ప్రారంభం.. టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం