(Kamalananda Bharathi Swamy) కృష్ణా : కేసరపల్లి భువనేశ్వరీ పీఠం పీఠాధిపతిగా కమలానంద భారతీస్వామి నియమితులయ్యారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వామి కమలానంద భారతీకి పట్టాభిషేకం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పట్టభిషేక మహోత్సవం కార్యక్రమానికి వివిధ పీఠాల నుంచి పది మంది స్వామీజీలు హాజరయ్యారు. వీరందరికీ పాద పూజ చేపట్టి ఆశీర్వాదాలు పొందారు. అంతకుముందు పీఠంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీస్వామిని వేద పండితులు మంత్రాలు చదువుతూ మేళతాళాలతో స్వాగతం పలికారు. కుర్తాళం పీఠాధిపతిని కమలానంద భారతీస్వామి దగ్గరుండి మరీ ఘనంగా స్వాతగించారు. ఈ కార్యక్రమంలో వివిధ పీఠాధిపతులు, బ్రాహ్మణ సంఘ నేతలు, పండితులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..