Junior NTR | జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అనంతపురం శ్రీనగర్ కాలనీలోని టీడీపీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అక్కడే బైఠాయించి, నినాదాలు చేశారు. ఆఫీసు ముందు, నగరంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చింపేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదని తెలిపారు. నందమూరి ఫ్యాన్స్ లేనిదే టీడీపీ లేదని తెలిపారు. మేం కన్నెర్ర చేస్తే తెలుగు దేశం పార్టీనే ఉండదని హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ మొహం చూసి ఓట్లేస్తే ఎమ్మెల్యేగా గెలిచావని దగ్గుబాటి ప్రసాద్‌పై మండిపడ్డారు. దగ్గుబాటి ప్రసాద్ ఆడియో వైరల్ కావడంతో.. అది ఏఐ వీడియో అని ఆయన ఖండించారు. అది ఫేక్ ఆడియో అయినప్పటికీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. కానీ ఎమ్మెల్యే క్షమాపణలపైనా నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆడియో క్లిప్‌లో ఉన్న వాయిస్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌దేనని స్పష్టం చేశారు.
Tdp2
నాలుగు గోడల మధ్య చెప్పే క్షమాపణలు మాకు అక్కర్లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బహిరంగంగా వచ్చి అందరి మధ్యలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే డైరెక్ట్ ఎటాక్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మా అన్న ఏ రోజూ రాజకీయాల్లో తలదూర్చలేదు.. ఒక వేళ మా అన్న రాజకీయాల్లోకి వచ్చి ఉంటే మీరు ఎమ్మెల్యేలు అయ్యే వాళ్లా అంటూ మండిపడ్డారు. కాగా, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అందుబాటులో లేరని.. ఆయన వచ్చాక బహిరంగ క్షమాపణలు చెప్పిస్తానని ఎమ్మెల్యే ప్రధాన అనుచరుగు గంగారాం హమీ ఇచ్చారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన విరమించారు.
నందమూరి ఫ్యాన్స్ లేనిదే టీడీపీ పార్టీ లేదు
మేము కన్నెర్ర చేస్తే టీడీపీ పార్టీ ఉండదు.. మేము ఓటేసి వీళ్లను గెలిపించాం
నాలుగు గోడల మధ్య మాకు క్షమాపణలు వద్దు
ఎమ్మెల్యే బహిరంగంగా వచ్చి అందరి మద్యలో జూనియర్ ఎన్టీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని అభిమానుల ఆగ్రహం https://t.co/11L2ZF2CeN pic.twitter.com/hn3YMx6jlb
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025
ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడుతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌తో మాట్లాడిన ఒక ఫోన్ కాల్ ఆడియో తాజాగా లీకయ్యింది. అందులో వార్ 2 సినిమా షోలను అనంతపురంలో నిలిపివేయాలని హెచ్చరించడంతోపాటు బూతులతో రెచ్చిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారు? నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వను. పర్మిషన్ లేకుండా ప్రత్యేక షోలు ఎలా వేస్తారు. వాడి సినిమాకు ఎలా వెళ్తారు.. కూలీకి పోండి.. పార్టీకి కలిసిరాని వ్యక్తి సినిమాకు ఎలా వెళ్తారు. ఆ సినిమా వేస్తే కాల్చేస్తాను.. ఆ సినిమా రీల్ కూడా రాదు. నా అనుమతి లేకుండా సినిమా ఎలా ప్రదర్శిస్తారు. వాడితో డ్యాన్సులు చేస్తారా? మీరు సినిమా చూడండి మీకు అప్పుడు చెబుతాను. సినిమాను ప్రదర్శిస్తే మధ్యలోనే కాల్చేస్తా. వాడి సినిమా ఈ టైమ్‌లో ఎలా వేస్తారు. ఆడించుకోండి చూద్దాం.’ అంటూ ఎమ్మెల్యే మాట్లాడటం అందులో ఉంది. ఇది చూసి ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు.
ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీశ్ చేశారు. ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నాని మండిపడ్డారు. తాను మొదట్నుంచి నందమూరి కుటుంబానికికి అభిమానిని అని.. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు ఇష్టంగా చూసేవాడినని తెలిపారు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ను తాను తిడుతున్నట్లుగా ఆడియో సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆడియోపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ ఆడియో కాల్స్ వల్ల ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకుని ఉంటే.. క్షమించండని విజ్ఞప్తి చేశారు. నా ప్రమేయం లేకపోయినప్పటికీ.. నా పేరును ప్రస్తావించారు కాబట్టే ఈ క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. కానీ ఇలా వీడియో రూపంలో క్షమాపణ చెప్పడం కాదు.. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను బూతులు తిట్టిన ఆడియో లీక్‌పై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
ఈ ఆడియో రికార్డు నాది కాదు.. లోకల్ రాజకీయాల్లో భాగంగా నాపై గిట్టని వాళ్లు ఈ వీడియో పెట్టారు
నాకు నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అంటే చిన్నప్పటి నుండి చాలా అభిమానం… https://t.co/9IxsLm8heg pic.twitter.com/PtT5WQqZzo
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025