Junior NTR Fans | జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఆయన నివాసం, క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాన్స్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వద్ద హైటెన్షన్ నెలకొంది.
వార్ 2 చిత్రం రిలీజ్ సమయంలో దగ్గుబాటి ప్రసాద్ అనుచితంగా మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 48 గంటల గడువునిస్తూ ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. ఆ గడువు ముగియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఆదివారం ఉదయం అనంతపురంలోని టీటీడీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు.
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై తిరగబడ్డ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు
దగ్గుపాటి ప్రసాద్ ఆఫీసును చుట్టుముట్టిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను చెదరగొట్టిన పోలీసులు
జూనియర్ ఎన్టీఆర్‌కు ఎమ్మెల్యే ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ https://t.co/k5sv06nlz6 pic.twitter.com/rvFvcfXw8L
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2025
ఎన్టీఆర్ అభిమానులు వచ్చారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫ్యాన్స్‌ను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వెళ్లే మార్గంలో భారీ బందోబస్తు కల్పించారు. బారికేడ్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆ భద్రతను దాటుకుంటూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి ఎన్టీఆర్ అభిమానులు బయల్దేరారు. వారిని అడ్డుకున్న పోలీసులు పర్మిషన్ లేదని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో పలువురు అభిమానులను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే బయటకొచ్చి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పదవికి దగ్గుబాటి ప్రసాద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Ananthapuram2
Ananthapuram3