అమరావతి : పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 16న వాగులో కొట్టుకుపోయి చనిపోయిన ఇద్దరు టీచర్ల (Teacers) కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఏపీ మంత్రి సంధ్యారాణి (Minister Sandhyarani) వెల్లడించారు.
సాలూరు మండలం సరాయివలస గ్రామంలో ఏకలవ్య పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్తి, వార్డెన్‌గా పనిచేస్తున్న మహేశ్ విధులు నిర్వహించుకుని తిరిగి వారు నివాసముంటున్న గ్రామానికి బైక్‌పై బయలుదేరారు. వారు ఒట్టిగెడ్డవాగులో వాగును దాటే క్రమంలో ఇద్దరు ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఆర్తి మృతదేహం దొరకగా, మహేశ్ మృతదేహం మరుసటి రోజు లభించింది. వీరిద్దరూ మృతి చెందడం పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించి మృతదేహాలను అంబులెన్స్‌లో(Ambulance) స్వస్థలమైన హర్యానకు పంపింది.
ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మంగళవారం మాట్లాడుతూ ఘటనలో మృతి చెందిన వీరిద్దరి కుటుంబాలకు ఉద్యోగం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కేంద్రం రూ. 10 లక్షలు, రాష్ట్రం రూ. 5 లక్షలు మృతుల కుటుంబాలకు అందజేస్తామని, ఎలాంటి సాయమడిగినా ఇవ్వాలని సీఎం ఆదేశించారని ఆమె వెల్లడించారు.