హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు ఐటీ సేవలను ఉచితంగా ఇచ్చేందుకు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, టీటీడీ మధ్య శుక్రవారం ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిపై అపారమైన భక్తితో రిలయన్స్ జియో యాజమాన్యం టీటీడీ ఐటీ విభాగానికి హార్డ్వేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్ని పూర్తి ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. శ్రీవారి భక్తులకు అత్యాధునిక మొబైల్ యాప్ తయారు చేయనున్నట్టు జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ తెలిపింది. ఈ యాప్ ద్వారా టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు భక్తులకు అందుబాటులోకి వస్తాయి.