విజయవాడ : (Pawan Kalyan) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
టీటీడీ సూచించనట్లుగానే 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సొసైటీగా ఏర్పాటయ్యారని, ఇప్పుడు కార్పొరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న వ్యవస్థలను మార్చడంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నదని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొనే పలు నిర్ణయాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తు్న్నాయన్నారు. ఇసుక పాలసీ, ఎయిడెడ్ పాఠశాలలు-కళాశాలల విలీనం.. ఇప్పుడు టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల్ని రోడ్డుపైకి లాగుతున్నదని చెప్పారు. ఒకే పని చేస్తున్న రెగ్యులర్, ఒప్పంద కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్డు 2016 లో ఇచ్చిన తీర్పును వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తున్నదన్నారు. కార్పొరేషన్లో చేరని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడం సరికాదని పవన్ చెప్పారు.
అక్కడ మొబైల్స్ కొట్టేస్తున్నరు.. ఇక్కడ అమ్మేస్తున్నరు..
5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..