Mudragada | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలవడంతో ముద్రగడ పద్మనాభం ఇప్పుడు టార్గెట్ అయ్యారు. పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాలు విసిరిన ముద్రగడ.. తన శపథం ప్రకారం పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్నారు. అయినప్పటికీ ఆయనపై జనసేన ఫ్యాన్స్ విమర్శలు ఆగలేదు. దీంతో మీడియా ముందుకొచ్చి మరీ ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పవన్ కల్యాణ్‌కు పలు సూచనలు కూడా చేశారు. ఈ క్రమంలో ముద్రగడ కూతురు బార్లపూడి క్రాంతి తీవ్రంగా స్పందించారు. పేరు మార్చుకున్నప్పటికీ.. ఆలోచన విధానం మాత్రం మారలేదంటూ తండ్రినపై ధ్వజమెత్తారు.
నా తండ్రి ఇటీవల తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.. కానీ ఆయన ఆలోచనా విధానం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉందని క్రాంతి అన్నారు. జగన్మోహన్రెడ్డిని ఏనాడు ప్రశ్నించని ఆయనకు.. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. ఒకసారి తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న తర్వాత కాపుల విషయం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ఆయనకు ఎందుకో అర్థం కావడం లేదన్నారు.
పవన్ కల్యాణ్‌కు ఏం చేయాలో ఒక స్పష్టత ఉందని క్రాంతి తెలిపారు. ఏం చేయాలో తన తండ్రి ముద్రగడకే స్పష్టత లేదనిపిస్తుంని విమర్శించారు. ఆయన ఇంటికే పరిమితమైన తన శేష జీవితంలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఒక కూతురిగా సలహా ఇస్తున్నానని అన్నారు. మళ్లీ పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే.. గట్టిగా ప్రతిఘటిస్తానని హెచ్చరించారు.