Vijayasai Reddy | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఒకవైపు పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తేస్తూనే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడారు. 75 ఏండ్ల చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి.. పవన్ కల్యాణ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలన్నట్లుగా పరోక్షంగా ఎన్డీయేకు సలహా కూడా ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి నాయకత్వం, ప్రాతినిధ్యం వహించడానికి ఏపీలోని ఎన్డీయే నాయకుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్హుడని తాను నమ్ముతున్నట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఆయన ఆదర్శవంతమైన వ్యక్తి అని కొనియాడారు. యువ రాష్ట్రానికి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేడని చంద్రబాబుపై పరోక్షలు విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు.
జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ కూడా విజయసాయి రెడ్డి ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారుఏ. 74 ఏండ్ల ముసలాయన మహాత్మాగాంధీ క్విట్ ఇండియా అంటూ యావత్ భారత దేశ స్వాతంత్ర సంగ్రామ ఉద్యమాన్ని నడపగా లేనిది.. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేయలేరా అని ప్రశ్నించారు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి అని హితవు పలికారు. రాష్ట్రాన్ని ఎవరు పాలించారో ప్రజలు నిర్ణయిస్తారని.. అది మీ పని కాదని అన్నారు. రాజకీయాలకు సెలవు తీసుకొని హాయిగా చేసిన తప్పు ఒప్పుకుని జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి రావాలని అన్నారు.