Pawan Kalyan | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్లో ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో మరోసారి అలాంటి పరాభవం ఎదురుకావద్దనే ఉద్దేశ్యంతో ముందుగానే అలర్ట్ అయ్యాడు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే కాకినాడపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. ఈసారి ముందుగానే అలర్ట్ అయ్యారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయం సొంతం అవుతుందనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాల్లోని అనుకూల, ప్రతికూల పరిస్థితులపై పరిశీలన జరిపారు. కాకినాడలో జనసేన క్యాడర్ భారీగా, బలంగా ఉందని, ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామని పార్టీ కార్యకర్తలు ఇటీవల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట. ఈ క్రమంలోనే కాకినాడ నుంచి పోటీపై పవన్ కళ్యాణ్ కసరత్తు చేశారు. అక్కడ సామాజికవర్గం కూడా కలిసొచ్చే అవకాశం ఉండటంతో కాకినాడను ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాకినాడ నియోజకవర్గంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఫోకస్ చేశారు. కాకినాడలో పర్యటిస్తూ.. డివిజన్ల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే సిటీలోని 50 డివిజన్లలో 28 డివిజన్ల పెద్దలతో సమావేశమయ్యారు. కాకినాడలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయనే దానిపై మంతనాలు జరిపారు. గత వారంలో మూడు రోజులపాటు కాకినాడలో పర్యటించిన పవన్.. మరో రెండు మూడు రోజులు అక్కడే ఉండనున్నారు.