అమరావతి : ఏపీ గ్రీన్ సొసైటీ ( Green Society Chairman ) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ( Nagababu ) బాధ్యతలు స్వీకరించారు. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా శుక్రవారం అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో సతీమణి పద్మజ తో కలసి పాల్గొన్నారు.
ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాగబాబును పీసీసీఎఫ్ పి.వి.చలపతి రావు, అడిషనల్ పీసీసీఎఫ్ చీఫ్ రాహుల్ పాండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జున రావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు వై. శ్రీనివాసరెడ్డి, పీసీసీఎఫ్ విజిలెన్స్ రేవతి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ బి.ఎన్.ఎన్. మూర్తి , పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తదితర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.