Pawan Kalyan : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పవన్ అమిత్‌షాతో సమావేశమయ్యారు. సహకార శాఖ నుంచి నిధుల కేటాయింపు గురించి అమిత్ షాతో పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్రంలో మాదిరిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వమే కొలువుదీరడంతో ఏపీకి కేంద్ర నిధులు వరదలా వస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు బీజేపీ పాలిత రాష్ట్రాలకు, బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అధిక నిధులు అందిస్తోంది. ఇతర రాష్ట్రాలపై వివక్ష చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేన అధినేత ఇవాళ కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు.