ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాలు విసిరారు. దమ్ముంటే జమ్మలమడుగులో తనపై పోటీ చేయాలన్నారు. జమ్మలమడుగులో టీడీపీ నేత భూపేశ్ రెడ్డితో కలిసి మెగా జాబ్ మేళాను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు.
స్థానిక వైసీపీ నాయకులు తనకు ఏ మాత్రం సరితూగరని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్థలాలను స్థానిక వైసీపీ నాయకులు కబ్జా చేశారని, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. వాటన్నింటినీ బట్టబయలు చేస్తామని చెప్పారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, గండికోట ముంపు పరిహారం, టిడ్కో ఇళ్ల పంపిణీ చేసేలా చర్యలు చేసినట్లు తెలిపారు.