అమరావతి : వైసీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో జగన్ క్విడ్ ప్రోకో (Quid Proco) విధానం ద్వారా వచ్చిన సొమ్మును వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు తరలించారని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమర్ (Minister Gottipati Ravikumar ) ఆరోపించారు. ఐదేళ్లలో జరిపిన విద్యుత్ కొనుగోళ్లలో(Power Purchases) జగన్ ప్రభుత్వం పారదర్శకత పాటించలేదని విమర్శించారు.
జగన్, పెద్దిరెడ్డి బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం రహస్యంగా నడిపించారని పేర్కొన్నారు. ఏపీలో ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూళ్లకు జగనే అనుమతి ఇచ్చారని వెల్లడించారు. ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రస్తుతం ప్రజల మీద బారం పడుతుందని వివరించారు.
ఏపీ జెన్కోను నిర్వీర్యం చేశారని, ప్రజావసరాల కోసం ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేశారని మండిపడ్డారు. జగన్ కారణంగా ప్రస్తుతం ఏపీ ప్రజల మీద 2023-24 సంవత్సరానికి మరో రూ. 11,826 కోట్ల భారం పడుతుందని వెల్లడించారు.