అమరావతి : వైసీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohanreddy ) అమరావతి విషయంలో తన వైఖరిని మార్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ,లేనప్పుడు మరో మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు, భూ సమీకరణ చేసినప్పుడు జగన్ అభ్యంతరం చెప్పలేదని, అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల పేరిట హంగామా సృష్టించారని విమర్శించారు.
పార్లమెంట్లో 40 పార్టీలు ఏకగ్రీవంగా మద్దతిచ్చినా అమరావతి రాజధానిని కాదని మావిగన్ అంటూ కొత్త పలుకులు పలకడం సరికాదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉండాలని, గందరగోళ పరిస్థితి కల్పించవద్దని అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన వైసీపీ నాయకులపై దాడిని ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వైసీపీ నాయకులు అక్కడికి వ ఎందుకు వెళ్లారని పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.