Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూల కోసం ఓ డెయిరీ సంస్థ అక్రమ రీతిలో నెయ్యిని సరఫరా చేసిన అంశానికి సంబంధించిన కథనాన్ని ఆయన తన ఎక్స్‌లో పోస్టు చేశారు.
అమరావతి: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) డిమాండ్ చేశారు. సెక్యులరిజం రెండు మార్గాల్లో ఉంటుందని, మత విశ్వాసాల రక్షణ, గౌరవం అంశంలో రాజీ ఉండదని ఆయన అన్నారు. మన సనాతన ధర్మం అత్యంత ప్రాచీనమైందని, నాగరికతతో ఆ ధర్మం వర్థిల్లుతున్నదని, ఇలాంటి సమయాల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన ఎక్స్ అకౌంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఓ పోస్టు చేశారు. ఆ పోస్టులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“For the global Hindu community, Tirumala Tirupati Devasthanam is more than a pilgrimage center; it is a sacred spiritual sojourn. The Tirupati Laddu is not just a sweet; it is a shared emotion – we distribute it among friends, family and strangers alike, for it embodies our…
— Pawan Kalyan (@PawanKalyan) November 11, 2025
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం కోసం ఆ బోర్డు ఉండాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం యాత్రా స్థలం మాత్రమే కాదు అని, అది పవిత్ర ఆధ్యాత్మిక యాత్రకు కేంద్రమని, తిరుపతి లడ్డూ కేవలం స్వీటు మాత్రమే కాదు అని, అదొక భావోద్వేగం అన్నారు. మన స్నేహితులు, కుటుంబీకులు, దగ్గరవారికి ఆ లడ్డూను ఎంతో ప్రేమతో పంచిపెడుతామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది మనలో ఉన్న సామూహిక నమ్మకానికి, విశ్వాసాన్ని చాటుతుందన్నారు. ప్రతి ఏడాది సగటును 2. 5 కోట్ల మంది భక్తుల తిరుమలను దర్శించుకుంటారని, సనాతన విధానాలు అవలంబిస్తున్న వారి మనోభావాలను దెబ్బతీయాలని చూసినా, లేక హేళన చేసినా, అది కేవలం బాధను మాత్రమే కలిగించదు అని, లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఎక్స్‌లో తిరుపతి లడ్డూపై ఓ పత్రిక రాసిన కథనాన్ని రీపోస్టు చేశారు. టీటీడీ లడ్డూ తయారీ కోసం ఉత్తరాఖండ్‌కు చెందిన డెయిరీ సంస్థ నెయ్యి సరఫరాలో అక్రమాలకు పాల్పడినట్లు ఆ కథనం పేర్కొన్నది. ఒక్క పాలచుక్కను కూడా సేకరించని ఆ సంస్థ ఎలా 68 లక్షల కేజీ నెయ్యిని సరఫరా చేసిందని కథనంలో ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు ఆ డెయిరీ సంస్థ సుమారు 250 కోట్ల ఖరీదైన నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
— Pawan Kalyan (@PawanKalyan) November 11, 2025
దేశంలోని ఆలయాల సమస్యల పరిష్కరం కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

