అమరావతి : సోషల్ మీడియాలో (Social Media) సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెడుతున్న వారికి వైసీపీ నాయకులు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని ఏపీ హోంమంత్రి అనిత (AP Minister Anita ) వైసీపీ నాయకులను ఆరోపించారు. నీచమైన పోస్టులు పెట్టేవారిని పోలీస్‌స్టేషన్‌కు కాకుండా ఎక్కడకు తీసుకెళ్లాలని ప్రశ్నించారు.
విజయవాడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ సొంత తల్లి, చెల్లిపై సోషల్ మీడియా దారుణంగా ట్రోల్ చేసిన వ్యక్తులకు మద్దతివ్వడం, వారిని పోలీసులు అరెస్టులు చేస్తే గగ్గోలు పెట్టడం వైసీపీ (YCP) నాయకులకే చెల్లిందని విమర్శించారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారని ఆరోపించారు. మీ ఇంట్లోని సభ్యులపై కూడా ఎవరైనా తప్పుడు పోస్టింగులు చేస్తే కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు పెట్టిన పోస్టింగ్‌లపై అరెస్టు (Arrest) చేయకుండా అడ్డుకునేందుకు కోర్టులో కొందరు కేసులు వేయగా కోర్టు కూడా వారికి మొట్టికాయలు వేసిందని అనిత వెల్లడించారు. కర్నూలు జిల్లాలో (Kurnool District ) బాలికపై వైసీపీ సర్పంచ్ అత్యాచారానికి పాల్పడ్డాడని అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారని తెలిపారు.
జగన్‌కు దమ్ముంటే బాలిక కుటుంబాన్ని పరామర్శించాలని సూచించారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున అసభ్యప్రవర్తించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిందని వివరించారు. వైసీపీ నాయకుల దురాగతాలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా మహిళలు, యువతులు, బాలికలపై దుష్ప్రచారాలు చేయవద్దని కోరారు.