ISRO | వాతావరణ పరిస్థితులను మరింత మెరుగ్గా అధ్యయనం చేసే ప్రక్రియ ఇప్పుడు మరింత సులువు కానుంది. ఇన్శాట్-3డీఎస్ అనే కొత్త వెదర్ శాటిలైట్‌ను భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని మోసుకొని ఎస్ఎల్వీ-ఎఫ్ 14 నింగిలోకి దూసుకెళ్లింది. 2275 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని ఎస్ఎల్వీ-ఎఫ్ 14 రాకెట్ నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే వాతావరణ పరిస్థితులను మరింత మెరుగ్గా తెలుసుకోవచ్చు. భూమి, సముద్ర ఉపరితల మార్పులపై అధ్యయనానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. తద్వారా విపత్తులను ముందే పసిగట్టి హెచ్చరించవచ్చు.