విజయవాడ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు . ఇస్రో కీర్తి కిరీటంలో మరో మైలు రాయిని అందుకున్నారని. భవిష్యత్‌లోనూ చేపట్టే మిషన్లన్నీ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ56 (PSLV-C56) వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.ప్రయోగం జరిగిన తరువాత 23 నిమిషాలలో 7 ఉపగ్రహాలు నిర్దిష్ట కక్ష లోకి చేరుకున్నాయి. ఇందులో సింగపూర్‌కు చెందిన డీఎస్టీఏ ఎస్టీ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన డీఎస్ ఎస్ఏఆర్ (DS SAR) ఉపగ్రహంతోపాటు నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెంచిన వెలాక్స్-ఏఎం, ఆర్కేట్, స్కూబ్-2, న్యూలియాన్, గెలాసియా-2, ఓఆర్బీ-12 శాటిలైట్లు ఉన్నాయి. ఇవన్నీ సింగపూర్‌కు చెందినవే కావడం విశేషం.