హైదరాబాద్, జూన్20 (నమస్తే తెలంగాణ): సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతున్నది. ఈడీ కేసుల్లో జగన్ సహా దాదాపు 130 పిటిషన్లపై పదేండ్లుగా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం నుంచి చార్జీషీట్ల వారీగా డిశ్చార్జి పిటిషన్లపై విచారణ చేపట్టాలని న్యాయస్థానం నిర్ణయించింది.