నెల్లూరు జిల్లాలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1 వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని తొలిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ వేడుకలు వచ్చే నెల 1 నుంచి 20 వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల్లో వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ఈ అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్కాన్ నెల్లూరు అధ్యక్షులు సుఖ్‌దేవ్ గోస్వామి తెలిపారు. ఈ ఉత్సవంలో 50కి పైగా ఈవెంట్లు, 300 కు పైగా సబ్ క్యాటగిరీల్లో కార్యక్రమాలు ఉంటాయని, వీటిలో ఏ వయస్సు వారైనా ఉచితంగా పాల్గొనవచ్చునని చెప్పారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు లేవని, ఈ కల్చర్ ఫెస్ట్‌లో పాల్గొనేవారందరికీ ధృవీకరణ పత్రాలు, విజేతలు బహుమతులు అందిస్తామన్నారు. దేవుడు ఇచ్చిన ప్రతిభను అతడి ఆనందం కోసం ఉపయోగించడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమని సుఖ్‌దేవ్ గోస్వామి వెల్లడించారు.
ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అని సుఖ్‌దేవ్ గోస్వామి తెలిపారు. ఫైనల్స్ ప్రపంచవ్యాప్తంగా వివిధ సమయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో ఏడు ఖండాలకు చెందిన దాదాపు 80 దేశాలు పాల్గొననున్నాయిని చెప్పారు. మరింత సమాచారం కోసం చిన్మయ కృష్ణ దాసును 91 8919717982 లేదా 91 9701839381 లేదా cmkdasa@gmail.com మెయిల్లో సంప్రదించాలని సుఖ్‌దేవ్ గోస్వామి విజ్ఞప్తి చేశారు.