అధర్మంపై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా న్యాయమే గెలుస్తుంది : నారా లోకేశ్
Nara lokesh| ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ప్రభుత్వం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ప్రభుత్వం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఏపీ హైకోర్టు గత ఆరు నెలల క్రితం ఇచ్చిన తీర్పుపై ఇవాళ ఏపీ సర్కార్ సుప్రీంకు వెళ్లడంపై లోకేశ్ ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు.
అధర్మంపై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యవుల కేశవ్ మాట్లాడుతూ అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మరోసారి భంగపడక తప్పదని అన్నారు. రైతుల సంకల్పం ముందు ప్రభు త్వ కుట్రలు చాలా చిన్నవని , ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించేలా సుప్రీంకోర్టులోనూ తీర్పు వస్తుందని తెలిపారు.
చట్టసభలను వక్రీకరించేలా హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వదని ఎంపీ కనకమేడల తెలిపారు. ప్రభుత్వం వేసిన పిటిషన్ ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురవుతోందని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో నే హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ తప్పుబడుతున్నారని, రాజధాని నిర్మాణం చేపట్టకుండా 6 నెలలు కాలయాపన చేశారని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

