పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు చేయబోయి… గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకూ వెళ్లారు. ఈ నెల 29 న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాట్లు చేయడానికి టీడీపీ నేతలు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో కోడెల శివరాం వర్గం, వైవీ ఆంజనేయులు వర్గం మధ్య ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. వైవీ ఆంజనేయులు వేసిన టెంట్లను కోడెల వర్గం పీకిపారేసింది. దీంతో వైవీ వర్గం, కోడెల వర్గం మధ్య తీవ్రమైన తోపులాటలు జరిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకూ వ్యవహారం వెళ్లింది. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసింది. వెంటనే టీడీపీ కార్యాలయానికి చేరుకొని, ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ గొడవలు జరగడంపై ఆవిర్బావ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.