అమరావతి: కొవిడ్ విధుల్లో చనిపోయిన ఆశా వర్కర్ల కుటుంబాలను ఆదుకోవాలని , వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తు ఆశా కార్యకర్తలు చేపట్టిన ఆందోళన కాకినాడలో ఉద్రిక్తతకు దారి తీసింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు చలో కలెక్టరేట్‌ను నిర్వహించారు.
కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆశా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఆశా కార్యకర్తలు గాయపడ్డారు. ఒక కార్యకర్త స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆశా కార్యకర్తలు బారికేడ్లను దాటి రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి
పోలీసు స్టేషన్‌కు తరలించారు.