అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఏపీ సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 2063 కోట్లను కేటాయిస్తున్నామని ప్రకటించారు.
మున్సిపల్ శాఖకు రూ. 8,796 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ. 15,846 కోట్లు , రెవెన్యూ శాఖకు రూ. 5306 కోట్లు, సాంఘిక సంక్షేమానికి రూ. 12, 728 కోట్లు , వృత్తి నైపుణ్యం కింద రూ. 969 కోట్లు , రోడ్లు భవనాలకు, రూ. 8,581 కోట్లు, మహిళా, శిశుసంక్షేమానికి రూ. 4,382 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2.56,256 కోట్లు రెవెన్యూ వస్తుందని , వ్యయం రూ. 2,08,261 కోట్లు ఉంటుందని వెల్లడించారు. రెవెన్యూలోటు రూ 17, 036 కోట్లు, ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు ఉంటుందని వివరించారు. సెకండరీ ఎడ్యుకేషన్‌కు రూ. 27, 706 కోట్లు , ఈడబ్ల్యూఎస్‌కు రూ. 10,201 కోట్లు సివిల్ సప్లైస్‌కు రూ. 3,719 కోట్లు వెల్లడించారు. జీఏఈడీకి రూ.998 కోట్లు , సచివాలయ వ్యవస్థకు రూ. 3,396 కోట్లు , వ్యవసాయానికి రూ. 11, 387 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ. 1,568 కోట్లు అందజేస్తున్నామన్నారు. బీసీ సంక్షేమానికి రూ. 20,962 కోట్లు, పర్యావరణం, అటవీ శాఖకు రూ. 685 కోట్లు , ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు , విద్యుత్‌కు రూ. 10,281 కోట్లు ఈ సంవత్సరానికి కేటాయించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.