Srisailam | శ్రీశైలం : జ్యోతిర్లింగ, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రచార రథాన్ని బహూకరించాడు. హైదరాబాద్కు చెందిన బాలం సుధీర్ రూ.72లక్షల విలువైన తయారు చేయించిన రథాన్ని కానుకగా దేవస్థానానికి సమర్పించారు. ఈ ప్రచార రథాన్ని మంగళవారం దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రచార రథంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారల అనుకృతమూర్తులు, కల్యాణమూర్తులు నెలకొల్పారు.
వాహనం ముందు భాగంలో సాక్షిగణపతి రూపాన్ని, రథానికి వెనుకవైపున దక్షిణామూర్తి, కుడివైపున గణపతి, కుమారస్వామివారల ప్రతిమలను తీర్చిద్దారు. గంగాధర మండపం వద్ద ఉదయం ధర్మ ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూలు చేశారు. ఈ సందర్భంగా ఈవో ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో దేవస్థానం తరఫున ధర్మ ప్రచారం కార్యక్రమాలు నిర్వహించేందుకు ధర్మరథాన్ని వినియోగిస్తామన్నారు. దేవస్థానానికి ధర్మప్రచార రథాన్ని అందజేయడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నామని.. స్వామిఅమ్మవార్ల అనుగ్రహంతో ఈ అదృష్టం కలిగిందని దాత సుధీర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీ రమేశ్ నాయుడు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.