అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం (Ganja seize ) చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండటంతో పోలీసులు పలుచోట్ల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా శనివారం మంగళగిరి కాజి టోల్గేట్ వద్ద ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు(Special Task Force) వాహనాలను తనిఖీ చేశారు. రెండు కార్లలో అనుమానం ఉన్న వ్యక్తులను గమనించి కార్లను తనిఖీ చేయగా అందులో ఉన్న 230 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కారులో ఉన్న అమీర్, అబ్దుల్లా ఫారుఖ్, కార్తికేయన్, మల్లికార్జున్, కాలేయ్ మృధన్ అనే ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 34 వేల నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు పోలీసులు వెల్లడించారు.