Srisailam | శ్రీశైలం : కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. చివరి సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు చలిని సైతం లెక్క చేయకుండా వేకువ జాము నుంచే కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుకొని.. పాతాళగంగలో పవిత్ర స్నానాలు చేశారు.
స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు
పలువురు భక్తులు కృష్ణానదిలో కార్తీక దీపాలను వదిలారు. ఆ తర్వాత ఆలయ క్యూలైన్లలో బారులు తీరి స్వామి, అమ్మవార్లను దర్శించుకొని.. మొక్కులు చెల్లించారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించారు. స్వామి అమ్మవార్ల ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం, అతిశీఘ్ర దర్శనానికి గంట సమయం పట్టింది.
నాగహారతి
సాయంత్రం సమయంలో పుష్కరణి వద్ద లక్షదీపార్చన కార్యక్రమం నయనానందకరంగా జరిగింది. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదిక వద్దకు భ్రమరాంబ మల్లికార్జునుల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేక పుష్పాలంకరణతో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహించినట్లు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు.
పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న హోంమంత్రి అనిత
కార్తీక మాసంలో పూష్కరిణి వద్ద మహిళలు దీపాలు వెలిగించుకునే అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత పుష్కరిణి హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. దశవిధ హారతులను చూసేందుకు తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు క్షేత్రానికి తరలివచ్చినట్లు శ్రీశైలప్రభ సంపాదకుడు డాక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు.
గౌరవ వందనం స్వీకరిస్తున్న అనిత
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న ఆమెకు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఘన స్వాగతం పలికారు. భ్రమరాంబ అతిథి గృహం వద్ద జిల్లా సాయుధ బలగాల నుంచి హోంమంత్రి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమెకు ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి.. స్వాగతం పలికారు.
పాతాళగంగలో భక్తుల స్నానాలు
సింహహారతి
చంద్రహారతి
కుంభ హారతి
హారతి ఇస్తున్న అర్చకులు
ఓంకార హారతి
పల్లకీసేవ
పూజ కార్యక్రమాల్లో హోంమంత్రి అనిత
భ్రమరాంబ, మల్లికార్జునస్వామి
పుష్కరణి వద్ద దీపాలు వెలిగిస్తున్న భక్తులు
హారతి ఇస్తున్న అర్చకుడు