అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant) లో భారీ ప్రమాదం ( Massive explosion ) జరిగింది. ప్లాంట్లో ఎంసీఎంఎస్-2, ఎస్టీసీ-3లో హీట్ ఎఫ్జీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది . ఈ ప్రమాద సమయంలో మొత్తం 15 మంది కార్మికులు ఉండగా 10 మందికి తీవ్ర గాయాలయి నట్లు ప్రాథమిక సమాచారం.
ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు .సమాచారం అందుకున్న రెస్క్యూటీం ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ కార్మికులను, ఉద్యోగులను హుటాహుటినా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.