అమరావతి : రాష్ట్రంలోని దిశ పోలీస్ స్టేషన్ల(Disha police stations) పేర్లు మారుస్తామని హోమంత్రి వంగ లపూడి అనిత (Vangalapudi Anitha) స్పష్టం చేశారు. బుధవారం ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరిం చిన అనంతరం మాట్లాడారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. బాధితులు కేసు రీ ఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామన్నారు. అలాగే 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణాను చాలా వరకు తగ్గిస్తామన్నారు.
సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన హెచ్చరించారు. పోలీ సుల్లో పాత ప్రభుత్వ ఆలోచనలు ఎవరికైనా ఎంటే పక్కకు తప్పుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు అను కూలంగా పని చేయాలని సూచించారు. తనపై పెట్టిన గురుతర బాధ్యతన సమర్ధంగా నిర్వహిస్తానని హోమం త్రి తెలిపారు. కాగా, అంతకు ముందు ఆమె ఏపీ హోం మంత్రిగా (Home minister) బాధ్యతలు తీసుకున్నారు (took charge).
సచివాలయంలోని బ్లాక్-2లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. హోం మంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. బాధ్యతల స్వీకరించిన అనితకు పార్టీ నేతలు, ఉన్నతాధికారులు కలసి అభినందనలు తెలిపారు.